ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసమ్మతి పొడ గిట్టని కేంద్రం: రాహుల్ ఫైర్

ABN, First Publish Date - 2020-12-15T15:44:21+05:30

దేశంలో అసమ్మతి గళాలపై కేంద్రం వైఖరిని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. మోదీ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో అసమ్మతి గళాలపై కేంద్రం వైఖరిని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. మోదీ ప్రభుత్వానికి అసమ్మతి విద్యార్థులు దేశవ్యతిరేకులుగా కనిపిస్తారని, ఆందోళన వ్యక్తం చేసే పౌరులు అర్జన్ నక్సల్స్‌గా, వలస కార్మికులు కోవిడ్ క్యారియర్లుగా, అత్యాచార బాధితులు అసలు లేనేలేనట్టుగా, నిరసన తెలిపే రైతులు ఖలిస్థానీలుగా కనిపిస్తుంటారని, క్రోనీ క్యాపిటలిస్టులు మాత్రం ఆప్త మిత్రులుగా కనిపిస్తుంటారని ఎద్దేవా చేశారు.


కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కోవిడ్ నిర్వహణ తదితర అంశాలపై ఎన్డీయే ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు రాహుల్ ఎండగడుతున్నారు. నిరసనలు చేస్తున్న రైతుల మరణాలపై గత శనివారంనాడు ఆయన కేంద్రంపై విమర్శలు గుప్పించారు. మూడు వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం రద్దు చేసే లోపు ఇంకెంతమంతి రైతులు ప్రాణాలు కోల్పోవాలని నిలదీశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతు సంఘాలు గత నవంబర్ 26 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

Updated Date - 2020-12-15T15:44:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising