ఇంత దారుణంగా కొడతారా?: రాహుల్ గాంధీ
ABN, First Publish Date - 2020-03-28T01:31:36+05:30
దేశవ్యాప్త లాక్‌డౌన్ పేద ప్రజలను తీవ్ర నాశనం చేస్తోందని, వారిపై తీవ్రంగా ప్రభావంగా పడిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు
న్యూఢిల్లీ : దేశవ్యాప్త లాక్‌డౌన్ పేద ప్రజలను తీవ్ర నాశనం చేస్తోందని, వారిపై తీవ్రంగా ప్రభావంగా పడిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం మరింత ఉదారంగా నిధులను ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘ లాక్‌డౌన్ ప్రజలను తీవ్ర నాశనం చేస్తోంది. ఇది భారత్‌కు భారీ దెబ్బ. నిర్ణయాలు తీసుకునే క్రమంలో జాగ్రత్తగా ఆలోచించాలి. కరోనాను ఎదుర్కోడానికి మరింత దాతృత్వాన్ని చూపాల్సిన అవసరం ఉంది’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో పాటు ఓ వీడియోను కూడా రాహుల్ జత చేశారు. గత నాలుగు రోజులుగా అన్నం లేకుండా ఏడుస్తున్న ఓ చిన్నారి వీడియో, కూరగాయలు తీసుకురావడానికి వెళ్తున్న క్రమంలో ఆ బాలుడి తండ్రిని పోలీసులు కొట్టిన వీడియోను కూడా రాహుల్ ట్వీట్ చేశారు.
Updated Date - 2020-03-28T01:31:36+05:30 IST