ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాథ్రస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్, ప్రియాంకకు అనుమతి

ABN, First Publish Date - 2020-10-03T21:51:32+05:30

హాథ్రస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎట్టకేలకు రాహుల్, ప్రియాంకకు అనుమతి లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : హాథ్రస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎట్టకేలకు రాహుల్, ప్రియాంకకు అనుమతి లభించింది. వీరితో పాటు మరో ముగ్గురికి మాత్రమే పోలీసులు అనుమతినిచ్చారు. హత్రాస్ లో 144 సెక్షన్ అమలులో ఉందని, అందుకే ఐదుగురికి మాత్రమే అనుమతించామని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే రాహుల్, ప్రియాంక బయల్దేరిన నేపథ్యంలో వారి వెంట కార్యకర్తలు కూడా తరలివచ్చారు. అయితే కార్యకర్తలందర్నీ ఢిల్లీ టోల్‌గేట్ వద్ద పోలీసులు నిలిపివేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 



శుక్రవారం వరకూ హాథ్రస్ లోకి ఎవ్వర్నీ పోలీసులు అనుమతించలేదు. ఈ విషయంపైనే ప్రతిపక్షాలు, మీడియా, కుటుంబ సభ్యులు పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు. అయితే శనివారం మాత్రం పోలీసులు మొదట మీడియాకు అనుమతిచ్చారు. ఆ తర్వాత రాహుల్, ప్రియాంకకు అనుమతిచ్చారు. 

Updated Date - 2020-10-03T21:51:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising