ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీజీ కాపాడండి

ABN, First Publish Date - 2020-06-23T08:26:47+05:30

‘మీరు నా సభా నాయకుడు. మీరే నాకు రక్షణ కల్పించాలి’ అని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రధానిమోదీని అభ్యర్థించారు. ఇప్పటికే తన పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి తనకు భద్రత కల్పించాలని కోరుతూ ఆయన లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సభా నాయకుడైన మీరే రక్షణ కల్పించాలి
  • ప్రధానికి రఘురామ కృష్ణంరాజు లేఖ
  • భద్రతపై పరిశీలిస్తున్న హోం సెక్రటరీ

న్యూఢిల్లీ, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి) : ‘మీరు నా సభా నాయకుడు. మీరే నాకు రక్షణ కల్పించాలి’ అని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రధానిమోదీని అభ్యర్థించారు. ఇప్పటికే తన పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి తనకు భద్రత కల్పించాలని కోరుతూ ఆయన లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాసిన  విషయం తెలిసిందే. తనపై జరుగుతున్న దాడుల గురించి వివరిస్తూ తాజాగా ప్రధానికి ఆయన మరో లేఖ పంపించారు. తన ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని ప్రధానిని కూడా కోరారు. కాగా, స్పీకర్‌కు రఘురామకృష్ణంరాజు పంపిన లేఖను కేంద్ర హోం సెక్రటరీ పరిశీలిస్తున్నారని తెలిసింది. ఎంపీ కోరితే కేంద్ర హోంశాఖ భద్రత కల్పించిన దృష్టాంతాలున్నాయి. గతంలో రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్‌కు జడ్‌ కేటగిరీ భద్రతను కేంద్రం కల్పించింది. ఇలాంటి  సందర్భాల్లో సీఆర్పీఎఫ్‌ లేదా సీఐఎ్‌సఎఫ్‌ బలగాలతో భద్రత కల్పిస్తారు.


Updated Date - 2020-06-23T08:26:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising