ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2500 కిలోల వెండి పూతతో పూరి జగన్నాథ్ ఆలయ తలుపులు

ABN, First Publish Date - 2020-10-24T16:42:59+05:30

పూరిలోని ప్రముఖ జగన్నాథ్ ఆలయంలో తలుపులకు 2500 కిలోల వెండిపూతతో తలుపులు తయారు చేసి ఇచ్చేందుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై భక్తుడి విరాళం

భువనేశ్వర్ (ఒడిశా): పూరిలోని ప్రముఖ జగన్నాథ్ ఆలయంలో తలుపులకు 2500 కిలోల వెండిపూతతో తలుపులు తయారు చేసి ఇచ్చేందుకు ముంబై నగరానికి చెందిన ఓ భక్తుడు ముందుకు వచ్చారు.కొన్ని దశాబ్దాల తర్వాత పూరి జగన్నాథ్ ఆలయంలోని చెక్క తలుపులు, గర్భగుడి తలుపులకు మలేషియా నుంచి తెప్పించిన బర్మా టేకుతో పాటు పై పూతగా 2,500 కిలోల వెండిని వినియోగించాలని నిర్ణయించారు.రూ.15.32 కోట్ల విలువగల వెండిని ఆలయ తలుపుల తయారీ కోసం విరాళంగా ఇచ్చేందుకు ముంబై భక్తుడు ముందుకు వచ్చారు. 


వెండి తాపడంతో కూడిన తలుపులనుతయారు చేయించడానికి 17మంది ఆలయ కమిటీ నిర్వాహకులు, నిర్వహణ కమిటీ సభ్యులు ఆమోదించారు. కాలాహాత్ ద్వార్, జయవిజయ ద్వార్, బెహారానా ద్వార్, సత్పహచ్ ద్వార్, వెస్ట్ భోగ్ మండప్ ద్వార్, నరసింగ్ ఆలయ ద్వారం, బిమాల టెంపుల్ ద్వారం, మహాలక్ష్మీ టెంపుల్ ద్వారాలకు 2,500 వెండి పలకాలతో కప్పాలని నిర్ణయించారు. పురాతన గుడి తలుపులు దెబ్బతినడంతో వీటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. పూరి జగన్నాథ్ దేవాలయంలో 400 మందికి పైగా ఆలయ సేవకులకు కరోనా సోకడంతో గర్భగుడిలో రహస్య సేవలు సాగుతున్నాయి. 

Updated Date - 2020-10-24T16:42:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising