ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబ్‌లో థెరపీకి మత్తు బానిసలు

ABN, First Publish Date - 2020-04-10T06:13:14+05:30

లాక్‌డౌన్‌ కారణంగా దేశం మొత్తం ఇబ్బందులు పడుతుంటే అక్కడక్కడ మంచి కూడా జరుగుతోంది. పంజాబ్‌లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్‌, ఏప్రిల్‌ 9: లాక్‌డౌన్‌ కారణంగా దేశం మొత్తం ఇబ్బందులు పడుతుంటే అక్కడక్కడ మంచి కూడా  జరుగుతోంది. పంజాబ్‌లో మత్తు మందులు లభ్యంకాకపోవడంతో సదరు బానిసలు డీఅడిక్షన్‌ సెంటర్ల బాటపట్టారు. కరోనా వైర్‌సతో లాక్‌డౌన్‌ ఫలితంగా మత్తు మందులు అందుబాటులో లేవు. దీంతో వాటికి బానిసలైన వ్యక్తులు పంజాబ్‌లోని ప్రభుత్వ, అలాగే ప్రైవేటు సెంటర్లలో చేరుతున్నారు. ఎయిమ్స్‌ అంచనాల ప్రకారం పంజాబ్‌లో మత్తుమందు బానిసలు 7.2 లక్షలకు పైమాటే. గడచిన రెండు వారాల్లో రోజుకు సగటున వెయ్యిమంది మత్తు మందు బానిసలు ఆ కేంద్రాల్లో చేరుతున్నారు. ఫలితంగా వారందరికీ చికిత్స సదుపాయాలు అందిచాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కారు నెత్తిన పడింది. కొత్తగా చేరుతున్న వారితో కలిపి నాలుగు లక్షల మందికి పైగా మత్తు బానిసలు చికిత్స పొందుతున్నారు. డీఅడిక్షన్‌ అలాగే ఒఔటి క్లినిక్‌లలో వీరి సంఖ్య బాగా పెరిగిందని పంజాబ్‌ యాంటీ డ్రగ్‌ ఎస్‌టిఎఫ్‌ హెడ్‌ హర్‌ప్రీత్‌ సింగ్‌ సిద్దు తెలిపారు.  వ్యసనపరులను డీఅడిక్షన్‌ సెంటర్ల వద్దకు చేర్చాలని గ్రామాల్లోని సర్పంచులను, డిఎపిఒలను కోరుతున్నామన్నారు. రోజూ కనీసం పదిహేను వరకు ఇలాంటి కేసులు తమవద్దకు వస్తున్నాయని అమృత్‌సర్‌లోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ సైకియాట్రీ ప్రొఫెసర్‌ ఒకరు తెలిపారు. 

Updated Date - 2020-04-10T06:13:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising