ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్క‌డ ఒక్క‌రోజులో కోలుకున్న 952 మంది క‌రోనా రోగులు

ABN, First Publish Date - 2020-05-17T11:18:22+05:30

కరోనా వైరస్ అత్యంత వేగంగా దేశంలో వ్యాప్తి చెందుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య‌ 90 వేలు దాటింది. అయితే రోగులు కూడా అంతే వేగంతో కోలుకుంటున్నారు. దీనికి పంజాబ్ ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: కరోనా వైరస్ అత్యంత వేగంగా దేశంలో వ్యాప్తి చెందుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య‌ 90 వేలు దాటింది. అయితే రోగులు కూడా అంతే వేగంతో కోలుకుంటున్నారు. దీనికి పంజాబ్ ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది. శనివారం ఏకంగా 952 మంది రోగులు ఒకే రోజులో వివిధ ఆసుపత్రుల నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. పంజాబ్‌లో మొత్తం 1,946 మంది రోగులలో 1,257 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 657 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా కార‌ణంగా ఇప్పటివరకు 32 మంది మరణించారు. శనివారం పంజాబ్‌, తమిళనాడుల‌లో ఒకే రోజులో 939 మంది రోగులు కోలుకొని, తమ ఇళ్లకు చేరుకున్నారు. కాగా పంజాబ్‌లో లాక్‌డౌన్ మే 31 వ‌ర‌కూ కొన‌సాగనుంది. ఈ మేర‌కు సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు దేశవ్యాప్తంగా మే 31 లోపు లాక్డౌన్ పెంచాలని సూచించారు. నాలుగో దశ లాక్‌డౌన్‌ను మే 18 నుంచి కొన్ని మినహాయింపులతో అమలు చేయాలని కోరారు. 


Updated Date - 2020-05-17T11:18:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising