ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబ్‌లో కల్తీ మద్యం విలయ తాండవం... 86 మంది మృతి

ABN, First Publish Date - 2020-08-02T15:37:16+05:30

పంజాబ్ లో కల్తీ మద్యం విళయ తాండవం చేసింది. కల్తీ మద్యం సేవించి రెండ్రోజుల క్రితం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంజాబ్ : పంజాబ్ లో కల్తీ మద్యం విలయ తాండవం చేసింది. కల్తీ మద్యం సేవించి రెండ్రోజుల క్రితం 20 మంది మృతి చెందారు. తాజా లెక్కల ప్రకారం 86 కు చేరింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కల్తీ మద్యం కాసేటినా... తర్న్ తరన్, బటాలా, అమృత్‌సర్ ప్రాంతాల్లో మృతుల సంఖ్య తీవ్రంగా ఉంది. తర్న్ తరన్ అనే ప్రాంతంలో 63 మంది, అమృత్‌సర్ లో 12 మంది, గురుదాస్ పూర్‌లో 11 మంది మృతి చెందారు. ఇక, ఈ ఘటనకు బాధ్యుల్ని చేస్తూ ఎక్సైజ్ శాఖకు చెందిన ఏడు మంది అధికారులను, ఆరుగు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.


ఇప్పటి వరకూ 25 మందిని అరెస్టు కూడా చేసింది. మరోవైపు.. కల్తీ మద్యం కారణంగా మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఇక, ఈ కల్తీ మద్యం ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో పోలీసులు ఒక్క సారిగా కల్తీ మద్యం తయారీ స్థావరాలపై దాడులను ముమ్మరం చేశారు. అమృత్‌సర్, గురుదాస్ పూర్, తర్నా తరణ్ ప్రాంతంలో దాడులను ముమ్మరం చేశారు. 


మాఫియాను శిక్షించండి : సీఎం కేజ్రీవాల్ ట్వీట్

పంజాబ్‌లో కల్తీ మద్యం ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ‘‘ఈ ఘటన అత్యంత దురదృష్టకరం. మాఫియాలను అరికట్టడానికి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలి. కల్తీ మద్యం కేసులను కొన్ని నెలలుగా రాష్ట్ర పోలీసులు పరిష్కరించడం లేదు. వెంటనే సీబీఐకి అప్పగించాలి.’’ అని కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-08-02T15:37:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising