ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబ్ పోలీసు శాఖ భద్రతా సలహాదారుకు డీఐజీ ర్యాంక్

ABN, First Publish Date - 2020-06-24T04:09:31+05:30

పంజాబ్ పోలీసు శాఖ భద్రతా సలహాదారుగా నియమితుడైన బ్రిగేడియర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్ : పంజాబ్ పోలీసు శాఖ భద్రతా సలహాదారుగా నియమితుడైన బ్రిగేడియర్ గౌతమ్ గంగూలీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) ర్యాంకు ఇచ్చింది. ఆయన ఈ పదవిలో మూడేళ్ళపాటు ఉంటారు. 


ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో బ్రిగేడియర్ గౌతమ్‌ను డీఐజీగా నియమించేందుకు ఆమోదం లభించింది. పదవీ విరమణ పొందిన బ్రిగేడియర్ గౌతమ్ గంగూలీని పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)   దినకర్ గుప్తాకు భద్రతా సలహాదారుగా నియమించేందుకు మంత్రివర్గం అనుమతించింది. 


డీజీపీ దినకర్ గుప్తాకు బ్రిగేడియర్ గంగూలీ అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. రాష్ట్రంలో సలహాదారులు ఎక్కువగా ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కువ మందిని సలహాదారులుగా నియమించడం వల్ల ఖజానాపై భారం పడుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 


బ్రిగేడియర్ గంగూలీ 33 ఏళ్ళపాటు భారత సైన్యంలో సేవలందించారు.


Updated Date - 2020-06-24T04:09:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising