పీఎ్‌సఎల్వీ-సీ49కి రైట్... రైట్
ABN, First Publish Date - 2020-11-06T08:31:54+05:30
ఇస్రో ధ్రువ ఉపగ్రహ వాహక నౌక (పీఎ్‌సఎల్వీ) 51వ సారి గగనయానానికి సిద్ధమైంది...
- రేపు మధ్యాహ్నం 10 ఉపగ్రహాలతో నింగిలోకి
శ్రీహరికోట(సూళ్లూరుపేట) నవంబరు 5: ఇస్రో ధ్రువ ఉపగ్రహ వాహక నౌక (పీఎ్‌సఎల్వీ) 51వ సారి గగనయానానికి సిద్ధమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో ఉన్న మొదటి ప్రయోగ వేదిక నుంచి ఒక స్వదేశీ, 9 విదేశీ ఉపగ్రహాలతో పీఎ్‌సఎల్వీ-సీ49 రాకెట్‌ను ప్రయోగించే సన్నాహాల్లో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. ఈ ప్రయోగం కోసం ఇస్రో గురువారం మధ్యాహ్నం రాకెట్ సన్నద్ధత సమావేశాన్ని(ఎంఆర్‌ఆర్) వర్చువల్ విధానంలో నిర్వహించింది. శుక్రవారం మధ్యాహ్నం 1.03గంటలకు ప్రారంభమయ్యే కౌంట్‌డౌన్ శనివారం మధ్యాహ్నం 3.03గంటలకు ముగిసిన వెంటనే రాకెట్ రోదసిలోకి దూసుకుపోనుంది. దీని ద్వారా మన దేశానికి చెందిన భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎ్‌స-01తో పాటు అమెరికా, లక్సెంబర్గ్ దేశాలకు చెందిన ఉపగ్రహాలు నాలుగు చొప్పున, లిథువేనియా దేశానికి చెందిన ఒక ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యల్లో ప్రవేశపెట్టనున్నారు.
Updated Date - 2020-11-06T08:31:54+05:30 IST