ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారంలోగా ఉమ్మడి విధానాన్ని రూపొందించండి : మూడు రాష్ట్రాలకు సుప్రీం నిర్దేశం

ABN, First Publish Date - 2020-06-04T18:22:16+05:30

కరోనా, లాక్‌డౌన్ కారణంగా ఢిల్లీ సరిహద్దులు మూసేయడం, ప్రజలు అష్టకష్టాలు పడతుండటంపై గురువారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కరోనా, లాక్‌డౌన్ కారణంగా ఢిల్లీ సరిహద్దులు మూసేయడం, ప్రజలు అష్టకష్టాలు పడతుండటంపై గురువారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజల ప్రయాణ సౌకర్యార్థం అంతర్రాష్ట్ర రవాణాకు, దేశ రాజధాని ప్రాంతం (నేషనల్ కేపిటల్ ఏరియా)లో ‘కామన్ పోర్టల్’ ను జారీ చేయాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించింది. ఇందుకు గాను ఢిల్లీ, యూపీ, హర్యానా రాష్ట్రాలకు సుప్రీం వారం రోజుల గడువు విధించింది.


మూడు రాష్ట్రాలూ ఈ విషయంలో ఉమ్మడి విధానాన్ని రూపొందించాలని నిర్దేశించింది. దీనిపై  కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాలతో సమావేశమై, చర్చించాలని కూడా సుప్రీం నిర్దేశించింది. కరోనా కేసులు పెరుగుతండటంతో కేజ్రీవాల్ నేతృత్వంలోని సర్కార్ వారం రోజుల పాటు ఢిల్లీ సరిహద్దులను మూసేసింది. కేంద్రం సవరించిన లాక్‌డౌన్ మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని హర్యానా ప్రభుత్వం హర్యానా - గుర్గావ్ సరిహద్దులను తెరవాలని నిర్ణయించింది.


ఈ నిర్ణయం తీసుకున్న తర్వాతే ఢిల్లీ సరిహద్దులను వారం రోజులపాటు మూసేయాలని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. హర్యానా, యూపీలతో సరిహద్దులు పంచుకుంటున్న ఢిల్లీ.... ఏడు రోజుల పాటు సరిహద్దులను మూసేయాలని నిర్ణయం తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ గురుగ్రామ్ నివాసి రోహిత్ భల్లా సుప్రీం తలుపు తట్టారు. దీంతో సుప్రీం పై విధంగా ఆదేశాలిచ్చింది. 


Updated Date - 2020-06-04T18:22:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising