ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంఎస్‌పీపై కేంద్రం తప్పుడు ప్రచారం : ప్రియాంక గాంధీ

ABN, First Publish Date - 2020-11-22T22:26:21+05:30

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ట్విటర్ వేదికగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంపుదల గురించి కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌పీని  ఉత్పాదక వ్యయం కన్నా తక్కువగా ఉంచినట్లు వెల్లడవుతోందని పేర్కొన్నారు. ‘నల్ల చట్టాల’ను బీజేపీ ప్రవేశపెట్టినపుడు ఎంఎస్‌పీని పెంచుతామని చెప్పిందన్నారు. అయితే ఉత్తర ప్రదేశ్‌లో క్షేత్ర స్థాయిలో పరిస్థితినిబట్టి చూసినపుడు కేంద్ర ప్రభుత్వం గురించి అసలు వాస్తవాలు బయటపడుతున్నాయని చెప్పారు. 


కేంద్ర ప్రభుత్వం ఇటీవల 3 వ్యవసాయ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టాలపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 26న ‘ఢిల్లీ చలో’ పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ చట్టాల ద్వారా పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం సహాయపడుతోందని ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపిస్తున్నారు.

అయితే ఈ చట్టాల వల్ల రైతులకు మేలు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది.


Updated Date - 2020-11-22T22:26:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising