ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ పాఠశాలల మూసివేత కొనసాగింపు: సిసోడియా

ABN, First Publish Date - 2020-10-28T19:05:36+05:30

ఐపీ (ఇంద్రప్రస్థా) యూనివర్శిటీ కిందకు వచ్చే కాలేజీల్లో 1330 సీట్లను పెంచాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టు సిసోడియా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల మూసివేత కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. స్కూళ్లు తిరిగి తెరిచేందుకు తల్లిదండ్రులు కూడా సుముఖంగా లేరని బుధవారంనాడు జరిగిన ఆన్‌లైన్‌ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన పేర్కొన్నారు. 'స్కూళ్లు తెరవడం సురక్షితమా కాదా అనే దానిపై సహజంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. దీనిపై ఎప్పటికప్పుడు వారిని సంప్రదిస్తున్నాం. స్కూళ్లు తెరిచిన చోట పిల్లల్లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటికిప్పుడు దేశ రాజధానిలో స్కూళ్లు తెరవరాదని మేము నిర్ణయించాం. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకూ స్కూళ్లు తెరుచుకోవు' అని సిసోడియా చెప్పారు. దీనికి ముందు, అక్టోబర్ 31 నుంచి పాఠశాలలు తెరుచుకుంటాయని ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఐపీ (ఇంద్రప్రస్థా) యూనివర్శిటీ కిందకు వచ్చే కాలేజీల్లో 1330 సీట్లను పెంచాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టు సిసోడియా తాజా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు.

Updated Date - 2020-10-28T19:05:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising