ఖైదీలు ప్రైవేటు లాయర్లనూ సంప్రదించవచ్చు
ABN, First Publish Date - 2020-07-08T06:56:27+05:30
ఢిల్లీ జైళ్ళలోని ఖైదీలు ఇకనుంచి న్యాయసాయం అందించే న్యాయవాదులతోపాటు ప్రైవేటు లాయర్లను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదించవచ్చని రాష్ట్ర జైళ్ల శాఖ ఢిల్లీ హైకోర్టుకు...
- హైకోర్టుకు తెలిపిన ఢిల్లీ ప్రభుత్వం
న్యూఢిల్లీ, జూలై 7: ఢిల్లీ జైళ్ళలోని ఖైదీలు ఇకనుంచి న్యాయసాయం అందించే న్యాయవాదులతోపాటు ప్రైవేటు లాయర్లను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదించవచ్చని రాష్ట్ర జైళ్ల శాఖ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఇంతవరకు ఖైదీలు లీగల్ ఎయిడ్ లాయర్లను సంప్రదించేందుకే అనుమతించేవారు. ఇకనుంచి వారు తమ ప్రైవేటు లాయర్ల నుంచి కూడా సేవలు తీసుకునేందుకు వీలుగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. హైకోర్టు సీజే డీఎన్ పటేల్ నేతృత్వంలోని ధర్మాసనానికి రాష్ట్ర జైళ్ల శాఖ తరఫున న్యాయవాది సత్యకామ్ ఈ మేరకు నివేదించారు.
Updated Date - 2020-07-08T06:56:27+05:30 IST