ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌లో విద్యార్థులకు ‘ఖైదీ టీచర్’ పాఠాలు!

ABN, First Publish Date - 2020-10-21T17:38:33+05:30

హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక జైలులో జీవిత శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీ 10 నుంచి 12 తరగతులు విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు,,,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక జైలులో జీవిత శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీ 10 నుంచి 12 తరగతులు విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌లో విద్యార్థులకు క్లాసులు నిర్వహించే ఒక సంస్థ ఈ ఖైదీ ప్రతిభను గుర్తించి, ఏడాదికి  8 లక్షల ప్యాకేజీతో అతనికి సైన్స్ టీచర్ ఉద్యోగం ఇచ్చింది. 


ఈ నేపధ్యంలో జైలు అధికారులు ఆ ఖైదీకి మద్దతునందించేందుకు ముందుకు వచ్చారు. వివరాల్లోకి వెళితే హిమాచల్‌ప్రదేశ్ రాజధాని శిమ్లా జైలులో బందీగా ఉన్న ఈ ఖైదీ ఉన్నత విద్యను అభ్యసించాడు. 2010లో తన ప్రియురాలితో పాటు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ నేపధ్యంలో ఆమె మృతి చెందగా, ఇతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే హత్యా నేరంపై అప్పటి నుంచి జైలులో జీవితకాల శిక్ష అనుభవిస్తున్నాడు. అతని ప్రతిభ గ్రహించిన జైలు అధికారులు అతనికి జైలులో సాంకేతిక పనులు చేసే పనిని అప్పజెప్పారు. జైలు అధికారుల అనుమతి మేరకు గత ఏడాది విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడం ప్రారంభించాడు. ఇతని టీచింగ్ విధానం నచ్చడంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ ఖైదీకి పెద్ద కంపెనీ నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించే ఉపాధ్యాయునిగా ఆఫర్ వచ్చింది. 


Updated Date - 2020-10-21T17:38:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising