ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామాలయం భూమి పూజ : లడ్డూల పంపిణీకి రావణుడి గుడి పూజారి సన్నాహాలు

ABN, First Publish Date - 2020-08-04T21:39:31+05:30

శతాబ్దాలనాటి కల సాకారమయ్యే క్షణాల కోసం రావణుడి గుడి పూజారి ఆనందోత్సాహాలతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అయోధ్య : శతాబ్దాలనాటి కల సాకారమయ్యే క్షణాల కోసం రావణుడి గుడి పూజారి ఆనందోత్సాహాలతో ఎదురు చూస్తున్నారు. అంగరంగ వైభవంగా ముస్తాబైన అయోధ్యలో, శ్రీరాముడు జన్మించిన భూమిలో, రామాలయం నిర్మాణానికి ఆగస్టు 5న భూమి పూజ జరిగే సమయంలో లడ్డూలు పంచాలని ఉత్సాహంతో ఉన్నారు. 


రావణుడి గుడి బిస్రఖ్‌లో ఉంది. ఈ గుడి పూజారి మహంత్ రామ్‌దాస్ మాట్లాడుతూ, బుధవారం జరిగే రామాలయ భూమి పూజ కోసం తాను చాలా ఆత్రుతగా, ఆనందంగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత తాను అందరికీ లడ్డూలు పంచుతానని చెప్పారు. 


అయోధ్యలో రామాలయం నిర్మితమవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. భూమి పూజ కార్యక్రమం పూర్తి కాగానే తాను లడ్డూలు పంచుతానన్నారు. రామాలయానికి భూమి పూజ జరుగుతుండటం చాలా శుభ పరిణామమని చెప్పారు. అద్భుతమై, దివ్యమైన దేవాలయం నిర్మితమవుతుండటం చాలా సంతోషకరమని చెప్పారు. 


రావణాసురుడి వల్లే శ్రీరామునికి గొప్ప ప్రజాదరణ లభించిందన్నారు. శ్రీరాముడు, రావణాసురుడు ప్రజాదరణ పొందడానికి ఒకరికొకరు కారణమని చెప్పారు. 


రావణాసురుడు లేకపోతే శ్రీరాముడి గురించి ఎవరికీ తెలిసేది కాదన్నారు. శ్రీరాముడు లేకపోతే రావణాసురుడి గురించి కూడా ఎవరికీ తెలిసేది కాదన్నారు. 


రావణాసురుడు బిస్రఖ్‌లోనే జన్మించాడని, దీనిని రావణుడి జన్మభూమి అంటారని చెప్పారు. రావణాసురుడు గొప్ప జ్ఞాని అని, తెలివైనవాడని చెప్పారు. సీతా దేవిని అపహరించిన తర్వాత లంకకు తీసుకెళ్ళి, అశోక వాటికలో ఆమెను ఉంచాడని, తన అంతఃపురంలో ఉంచలేదని చెప్పారు. అంతేకాకుండా రావణాసురుడు సీతాదేవి రక్షణ కోసం మహిళలనే నియమించాడన్నారు. శ్రీరాముడిని మర్యాదాపురుషోత్తముడని అంటే, రావణాసురుడిని కూడా కొంత వరకు అదేవిధంగా పిలవవచ్చునని చెప్పారు. 


బిస్రఖ్‌లోని రావణాసురుడి గుడిలో మహాశివుడు, పార్వతీ దేవి, కుబేరుడు విగ్రహాలు కూడా ఉన్నాయి.


Updated Date - 2020-08-04T21:39:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising