ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్లతో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం

ABN, First Publish Date - 2020-04-02T23:10:15+05:30

కోవిడ్-19 మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని మరింత పెంచేందుకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి కృషి చేస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 


రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింగ్, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు శుక్రవారం రాష్ట్రపతి భవన్ నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో తీసుకుంటున్న చర్యలు, అమలు చేయవలసిన కార్యక్రమాల గురించి అవసరమైన సలహాలు, ఆదేశాలు ఇస్తారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్-19పై తీసుకుంటున్న చర్యల గురించి మాట్లాడారు. 21 రోజుల అష్ట దిగ్బంధనానికి మద్దతిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. అష్ట దిగ్బంధనం వల్ల కోవిడ్-19 వ్యాప్తిని పరిమితం చేయడంలో విజయం సాధించామని తెలిపారు. అష్ట దిగ్బంధనం పూర్తయిన తర్వాత కూడా జన సంచారం తక్కువగా ఉండేలా చొరవ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను మోదీ కోరారు.


Updated Date - 2020-04-02T23:10:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising