ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీహార్ ఎన్నికల్లో ప్రధాన అస్త్రాలుగా ఉల్లి, ఆలూ, టమాటా!

ABN, First Publish Date - 2020-09-17T14:30:54+05:30

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. అయితే ఇంతలోనే రాష్ట్రంలో ఉల్లి, ఆలూ, టమాటాల ధరలు పెరగడం ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే ఉల్లి ధరలను అదుపు చేసేందుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. అయితే ఇంతలోనే రాష్ట్రంలో ఉల్లి, ఆలూ, టమాటాల ధరలు పెరగడం ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే ఉల్లి ధరలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆలూ, టమాటాల విషయంలో ధరల తగ్గింపు సాధ్యం కావడంలేదు. ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం దగ్గర ఉపాయం ఉన్నప్పటికీ, ఆలూ, టమాటాల ధరల విషయంలో అయోమయంలో పడింది. ఫలితంగా ఎన్డీఏ సర్కారు చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది. 


మరోవైపు విపక్షాలు ఇప్పటికే రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యావసరాల ధరలను గుర్తుచేస్తూ, ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. కాగా నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ అనేది కేంద్ర పౌరసరఫరాలశాఖ చేతుల్లో ఉంటుంది. ఈ శాఖకు లోక్ జనశక్తి పార్టీ నేత రామ్ విలాస్ పాశ్వాన్ బాధ్యత వహిస్తున్నారు. బీహార్‌లో పెరుగుతున్న నిత్యావసర ధరలపై బీజేపీ, జేడీయూ, ఎల్జేపీలు ఆందోళనకు దిగే ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా యూపీ, పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా ఆలూ పండిస్తారు. అయితే ఈసారి ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఆలూ ఉత్పత్తి తగ్గడంతో, మార్కెట్‌లో వీటికి కొరత ఏర్పడింది. అయితే నవంబరు నాటికి రెండవ దశ పంట ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నారు. 

Updated Date - 2020-09-17T14:30:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising