ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్రాస్ బాధితురాలి పోస్టుమార్టం రిపోర్ట్ విడుదల

ABN, First Publish Date - 2020-10-01T20:36:10+05:30

దళిత సామాజిక వర్గానికి చెందిన 20 ఏళ్ల యువతిపై సెప్లెంబర్ 14న అఘాయిత్యం జరిగింది. అనంతరం నిందుతులు ఆమె నాలుక కోసి, వెన్నెముకకు, మెడపై తీవ్ర గాయాలు చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: హత్రాస్‌తో అత్యాచారానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన బాధితురాలి పోస్టుమార్టం రిపోర్టు విడుదల చేశారు. దీనికి ప్రకారం.. అత్యాచారం సమయంలో బాధితురాలి మెడను పదే పదే నులిమివేశారని, దీంతో ఆమె మెడపై బలమైన గాయమైనట్లు ముగ్గురు వైద్యులతో సంతకం చేయబడిని రిపోర్టు పేర్కొన్నారు. అయితే ఈ గాయం ప్రాణం పోయేంత పెద్దది కాదని వైద్యులు తెలిపారు. ‘‘అలీఘర్ ఆసుపత్రి నుంచి వచ్చిన మెడికల్ రిపోర్ట్ ప్రకారం.. యువతిపై గాయాలను గుర్తించారు. కానీ, ఆమెపై బలవంతపు అత్యాచారం జరిగినట్లు పేర్కొనలేదు. ఫోరెనిక్స్ వారు ఇచ్చే రిపోర్ట్ కోసం వారు ఎదురుచూస్తున్నారు. రేప్ జరిగిందని చెప్పలేమని, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చాక తమ అభిప్రాయాన్ని చెప్తామని డాక్టర్ చెప్పారు’’ అని హత్రాస్ ఎస్పీ అన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన 20 ఏళ్ల యువతిపై సెప్లెంబర్ 14న అఘాయిత్యం జరిగింది. అనంతరం నిందుతులు ఆమె నాలుక కోసి, వెన్నెముకకు, మెడపై తీవ్ర గాయాలు చేశారు. తీవ్ర అవస్థలో ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.

Updated Date - 2020-10-01T20:36:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising