ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ రహదారి కోసం చెరువు పూడ్చివేత

ABN, First Publish Date - 2020-12-03T08:04:07+05:30

తెలంగాణలో జాతీయ రహదారిని విస్తరించడానికి చెరువును పూడ్చిన విషయంలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఒక కమిటీని నియమించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నష్టంపై అధ్యయనానికి ఎన్జీటీ కమిటీ


న్యూఢిల్లీ, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో జాతీయ రహదారిని విస్తరించడానికి చెరువును పూడ్చిన విషయంలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఒక కమిటీని నియమించింది. సూర్యాపేట-ఖమ్మం మధ్యలో 365బీబీ నంబరు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా.. జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) చెరువును పూడ్చివేసిందని దుశ్చర్ల సత్యనారాయణ అనే వ్యక్తి ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఎన్జీటీ న్యాయ సభ్యుడు జస్టిస్‌ కె.రామకృష్ణన్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. చెరువు పూడ్చివేత వల్ల పర్యావరణానికి కలిగిన హాని, ప్రజలకు జరిగిన నష్టం, నిబంధనల ఉల్లంఘన, పర్యావరణ అనుమతులు.. తదితర అంశాలపై అధ్యయనం చేయడానికి కేంద్ర పర్యావరణ శాఖ, ఎన్‌హెచ్‌ఏఐ, రాష్ట్ర మైనర్‌ ఇరిగేషన్‌ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్‌తో సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది. 

Updated Date - 2020-12-03T08:04:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising