ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ఫ్యూ పాస్‌లు చూపించమన్నారని.. పోలీసు చేయి నరికేశారు..

ABN, First Publish Date - 2020-04-12T17:15:10+05:30

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ను అమలు చేసేందుకు పోలీసులు అహర్నిశలు తీవ్రంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పటియాలా: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ను అమలు చేసేందుకు పోలీసులు అహర్నిశలు తీవ్రంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వారిని పోలీసులు అడ్డుకోగా.. కొందరు పోలీసులపై దాడులకు కూడా తెగబడుతున్నారు. సరిగ్గా ఇలాంటి దుర్ఘటనే పంజాబ్‌లోని పటియాలా జిల్లాలో చోటు చేసుకుంది.


ఒక వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు నిహంగాలను(ఆయుధాలు ధరించి ఉన్న సిక్కులు) ఓ కూరగాయల మార్కెట్ సమీపంలో ఆదివారం ఉదయం 6.15 నిమిషాలకు మండీ బోర్డు అధికారులు అడ్డుకున్నారు. ‘‘వాళ్లను కర్ఫ్యూ పాస్‌లు చూపించమని పోలీసులు అడిగారు. కానీ, వాళ్లు ఆగకుండా అక్కడ ఉన్న బ్యారికేడ్లు, గేట్లను ఢీకొడుతూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు’’ అని పటియాలా ఎస్పీ మన్‌దీప్ సింగ్ సిధు తెలిపారు.


ఆ తర్వాత వాళ్లని పోలీసులు అడ్డుకోగా.. పోలీసులపై వారు ఆయుధాలతో దాడి చేశారని పేర్కొన్నారు. ‘‘ఈ దాడిలో ఒక ఏఎస్‌ఐ చేయిని నరికేశారు. ఒక స్టేషన్ హౌస్ అఫీసర్, మరో అధికారి ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు’’ అని సిధు అన్నారు. ఆ ఏఎస్‌ఐని వెంటనే రాజీంద్ర ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు అతన్ని పీజీఐఎంఈఆర్‌కు తీసుకువెళ్లాలని సూచించారు. అయితే దాడికి తెగబడిన నిహంగాలు అక్కడి నుంచి పారిపోయారని.. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని పోలీసులు స్పష్టం 

Updated Date - 2020-04-12T17:15:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising