పశ్చిమ బెంగాల్లో పోలీస్ సంస్కరణలు అవసరం: హైకోర్టు
ABN, First Publish Date - 2020-12-11T05:26:41+05:30
పశ్చిమ బెంగాల్లో పోలీస్ సంస్కరణలు అవసరం: హైకోర్టు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో పోలీస్ సంస్కరణలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని కలకత్తా హైకోర్టు పేర్కొంది. దర్యాప్తు విభాగం నుంచి శాంతి భద్రతల విభాగాన్ని విభజించేలా సంస్కరణలు తీసుకురావాలని ధర్మాసనం సూచించింది. ఓ బాలిక అదృశ్యం కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. తగిన దర్యాప్తు, ఆధారాలు సమర్పించడంలో అలసత్వం కారణంగా క్రిమినల్ కేసుల పరిష్కారానికి విఘాతం కలుగుతోందని ధర్మాసనం పేర్కొంది. శాంతి భద్రతలను పర్యవేక్షించడం పోలీసు విధుల్లో ప్రధానమైన అంశమే అయినప్పటికీ... దాని వల్ల దర్యాప్తు విషయంలో రాజీపడే పరిస్థితి రాకూడదని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో పోలీస్ సంస్కరణల కోసం చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, హోం సెక్రటరీలకు ఈ ఆదేశాల కాపీలు అందజేయాలని హైకోర్టు పేర్కొంది.
Updated Date - 2020-12-11T05:26:41+05:30 IST