ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెడ్‌జోన్‌లో లాక్‌డౌన్‌ను ఉల్లంఘించడమే కాకుండా పోలీసులపై దాడి

ABN, First Publish Date - 2020-04-29T03:18:44+05:30

పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో పోలీసులపై లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన కొందరు రాళ్లు రువ్వారు. ప్రస్తుతం ఈ ఘటనకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హౌరా: పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో పోలీసులపై లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన కొందరు రాళ్లు రువ్వారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది. హౌరా జిల్లాలోని  టికియాపరా ప్రాంతం రెడ్‌జోన్ పరిధిలో ఉంది. దీంతో.. పోలీసులు ఈ ప్రాంతంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలుపరుస్తున్నారు.


అయితే.. మంగళవారం కొందరు వ్యక్తులు ఈ ప్రాంతంలో ఇళ్లలో నుంచి బయటికొచ్చి లాక్‌డౌన్‌ను ఉల్లంఘించారు. ఇళ్లకు వెళ్లిపోవాలని పోలీసులు చెప్పినా వినలేదు. వినకపోగా.. పోలీసులపైనే రాళ్లు రువ్వారు. రెండు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసు శాఖ కూడా ఈ ఘటనపై స్పందించింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిలో ఏ ఒక్కరిని ఉపేక్షించేంది లేదని, వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ట్వీట్‌లో స్పష్టం చేసింది.



Updated Date - 2020-04-29T03:18:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising