ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిసాన్ సూర్యోదయ యోజన పథకానికి నేడు మోదీ ప్రారంభం

ABN, First Publish Date - 2020-10-24T11:32:11+05:30

గుజరాత్ రాష్ట్రంలో కిసాన్ సూర్యోదయ యోజనతో పాటు మూడు ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్ (గుజరాత్): గుజరాత్ రాష్ట్రంలో కిసాన్ సూర్యోదయ యోజనతో పాటు మూడు ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించనున్నారు. గుజరాత్ రాష్ట్రంలో రైతులకు తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాగు అవసరాలకు నీటిని అందించేందుకు వీలుగా విద్యుత్ సరఫరాకు గాను కిసాన్ సూర్యోదయ యోజన పథకం అమలు చేస్తామని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తాజాగా ప్రకటించారు.రూ.3,500 కోట్లతో కూడిన ఈ పథకాన్ని ప్రధాని మోదీ నేడు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించనున్నారు. 


అహ్మదాబాద్ నగరంలోని యూఎన్ మెహతా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చు సెంటరులో పిల్లల హృద్రోగ ఆసుపత్రిని ప్రధాని ప్రారంభించనున్నారు. దీంతోపాటు అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ లో టెలీ కార్డియాలజీ మొబైల్ అప్లికేషన్ ను మోదీ ప్రారంభించనున్నారు. గిర్నర్ పర్వత ప్రాంతాల అందాలు తిలకించేలా రోప్ వే ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని గుజరాత్ అధికారులు చెప్పారు. 

Updated Date - 2020-10-24T11:32:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising