ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ మేలు మరువలేనన్న ట్రంప్... మోదీ స్పందన ఇదీ..!

ABN, First Publish Date - 2020-04-09T17:10:39+05:30

కరోనా వైరస్ మహమ్మారిపై కలిసికట్టుగా విజయం సాధిద్దామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారిపై కలిసికట్టుగా విజయం సాధిద్దామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి పిలుపునిచ్చారు. కోవిడ్-19పై జరుగుతున్న పోరాటంలో భారత్‌ తరపున సాధ్యమైనవన్నీ చేసేందుకు సిద్ధమని ఆయన తెలిపారు. మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్వీన్ (హెచ్‌సీక్యూ) మాత్రల ఎగుమతిపై నిషేధం సడలించడంపై ప్రధాని మోదీకి ట్రంప్ ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ... ‘‘అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇలాంటి పరిస్థితులు మిత్రులను మరింత దగ్గర చేస్తాయి. భారత్-అమెరికా బంధం ఎప్పటికీ దృఢంగా ఉంటుంది. కోవిడ్-19పై మానవాళి పోరాటంలో భారత్ సాధ్యమైన ప్రతి సహాయం చేస్తుంది. కలిసికట్టుగా ఈ పోరాటంలో మనం విజయం సాధించాలి..’’ అని వ్యాఖ్యానించారు. 


కాగా అమెరికాకు హెచ్‌సీక్యూ మాత్రల ఎగుమతికి అనుమతించిన ప్రధాని మోదీ ‘‘అద్భుతమైన నాయకుడు’’ అంటూ ట్రంప్ అంతకు ముందు ట్విటర్లో కొనియాడారు. ఇలాంటి విపత్కర సమయంలో భారత్ చేసిన సాయం ‘‘ఎప్పటికీ మర్చిపోలేనిది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 



Updated Date - 2020-04-09T17:10:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising