ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని ఫోన్ చేశారు: శివరాజ్

ABN, First Publish Date - 2020-07-27T21:39:19+05:30

తన ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకునేందుకు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసినట్టు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: తన ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకునేందుకు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసినట్టు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారంనాడు తెలిపారు. ప్రధాని ఆదివారం తనకు ఫోన్ చేశారని, అప్పుడు తాను ధ్యానం, యోగాలో ఉన్నానని, కొద్ది సమయం తర్వాత మళ్లీ ప్రధాని ఫోన్ చేశారని, తన ఆరోగ్యం గురించి తెలుసుకుని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారని శివరాజ్ ట్వీట్ చేశారు.


శివరాజ్‌కు కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలడంతో గత శనివారంనాడు ఆయన చిరాయు ఆసుపత్రిలో చేరారు. రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితిపై ఆసుపత్రి నుంచే ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదివారంనాడు సమీక్షించారు. మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని సైతం ఆసుపత్రి నుంచి ఆయన వీక్షించారు. తన ఆరోగ్యం బాగుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఓ వీడియో కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Updated Date - 2020-07-27T21:39:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising