ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటర్లకు చీరలు, డబ్బులు పంచుతున్న బీజేపీ ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2020-10-27T17:33:39+05:30

బీహార్‌లో ప్లురల్స్ పార్టీ నేత, బంకీపూర్ అభ్యర్థి పుష్ఫం ప్రియా చౌదరి ఒక సంచలన వీడియోను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్నా: బీహార్‌లో ప్లురల్స్ పార్టీ నేత, బంకీపూర్ అభ్యర్థి పుష్ఫం ప్రియా చౌదరి ఒక సంచలన వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో అప్‌లోడ్ చేశారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను షేర్ చేసిన పుష్పం ప్రియా... ఒక బీజేపీ నేత ఓటర్లను ప్రలోభపెడుతూ చీరలు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు.


ఈ వీడియోలో ఒక వాహనానికి బీజేపీ బ్యానర్ కట్టివుంది. అలాగే బీజేపీ ఎమ్మెల్యే అశోక్ కుమార్ సింగ్ పేరు రాసివుంది. ఆ వాహనంలో ఎన్నో చీరలు కనిపిస్తున్నాయి. అలాగే ఆ వాహనం దగ్గరున్న కొంతమంది అశోక్ కుమార్ సింగ్ పేరుతో నినాదాలు చేస్తున్నారు. అక్కడున్న జనం డబ్బులు పంచుతున్నారని చెప్పుకుంటున్నారు. కాగా ఈ వ్యవహారం గురించి సమాచారం అందుకున్న మీడియా అశోక్ కుమార్ సింగ్ కోసం ఫోను చేయగా, దానిని రిసీవ్ చేసుకోలేదు. ఈ వీడియోను షేర్ చేసిన పుష్ఫం ప్రియా చౌదరి... తాము ఓటర్లకు చీరలు, డబ్బులు పంచలేమని, అయితే తాము అధికారంలోకి వస్తే యువత గౌరవప్రదంగా జీవించేందుకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. 

Updated Date - 2020-10-27T17:33:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising