ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాస్మాథెరపీతో ప్రయోజనం అంతంతే : బీఎంజే

ABN, First Publish Date - 2020-10-25T09:44:28+05:30

కరోనా రోగులకు ప్లాస్మాథెరపీతో ప్రయోజనం అంతంతేనని బ్రిటీష్‌ మెడికల్‌ జర్నల్‌ (బీఎంజే) భారత్‌లో నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, అక్టోబరు 24: కరోనా రోగులకు ప్లాస్మాథెరపీతో ప్రయోజనం అంతంతేనని బ్రిటీష్‌ మెడికల్‌ జర్నల్‌ (బీఎంజే) భారత్‌లో నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఏప్రిల్‌ - జూలై మధ్యకాలంలో 468 మంది కరోనా రోగులపై జరిపిన అధ్యయనంలో ఈవిషయం తేలింది. మొదటి గ్రూపులోని 239 మంది రోగులకు 24 గంటల వ్యవధిలో రెండుసార్లు ప్లాస్మాను అందించగా.. 44 మంది (19 శాతం) రోగుల్లో ఇన్ఫెక్షన్‌ మరింత తీవ్రమవగా, పలు కారణాలతో కొందరు మృతిచెందారు. ఇక రెండో గ్రూపులోని 229 మంది రోగులకు సాధారణ చికిత్సే అందించగా 41 మంది (18 శాతం) రోగుల్లో ఇన్ఫెక్షన్‌ తీవ్రమవడంతో పాటు పలువురు చనిపోయారు. ఈ లెక్కన సాధారణ చికిత్స పొందినవారిలో, ప్లాస్మాథెరపీ చేయించుకున్న వారిలో చోటుచేసుకున్న ఆరోగ్య మార్పుల్లో భారీ వ్యత్యాసమేమీ లేదు. దీంతో ఇన్ఫెక్షన్‌ కట్టడికి, కరోనా మరణాలను తగ్గించడానికి ప్లాస్మాథెరపీ పెద్దగా దోహదపడటం లేదనే విషయం తేటతెల్లమైంది. 

Updated Date - 2020-10-25T09:44:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising