ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్ విమాన ప్రమాదం: వద్దని వారించినా వినని పైలట్లు

ABN, First Publish Date - 2020-06-05T01:54:19+05:30

మే 22న కరాచీలో జరిగిన పాక్ విమానం ప్రమాదం వెనుకు పైలట్ల నిర్లక్ష్యం ఉందని పాకిస్తాన్ పౌర విమానయాన శాఖ తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: మే 22న కరాచీలో జరిగిన పాక్ విమానం ప్రమాదం వెనుకు పైలట్ల నిర్లక్ష్యం ఉందని పాకిస్తాన్ పౌర విమానయాన శాఖ తెలిపింది. ఏటీసీ చేస్తున్న సూచనలు పైలట్ పట్టించుకోకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రకటించింది. విమానాన్ని ల్యాండ్ చేయద్దని ఏటీసీ రెండు సార్లు హెచ్చరించినట్టు తెలిపింది. ఈ హెచ్చరికలను పైలట్ వినిపించుకోలేదని చెప్పింది. ఫలితంగా.. అవసరమైన దానికంటే ఎక్కువ వేగంతో విమానం రన్‌వే వైపు దూసుకువచ్చిందని ప్రకటించింది. వేగంగా రన్‌వేను తాకిన విమానం కుదుపులకు లోనవడంతో విమానాన్ని దింపడం సాధ్యం కాదని పైలట్ గుర్తించాడని చెప్పింది. ఆ తరువాత మరోసారి విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లాక..కొన్ని నిమిషాలకు అది జావాసాల్లోకి దూసుకెళ్లి కూలిపోయింది. ఈ దుర్ఘటలో 97 మంది ప్రాణాలు కోల్పోగా..ఇద్దరు ప్రయాణికులు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

Updated Date - 2020-06-05T01:54:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising