ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీపీ మెరుగుదలకు పైలేట్స్ దోహదం : తాజా అధ్యయనం

ABN, First Publish Date - 2020-04-04T22:54:09+05:30

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పైలేట్స్ (యోగా వంటి సున్నిత వ్యాయామం) బాగా ఉపయోగపడుతోందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ డీసీ : గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పైలేట్స్ (యోగా వంటి సున్నిత వ్యాయామం) బాగా ఉపయోగపడుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది. 2018లో జరిగిన ఈ అధ్యయనంలో దాదాపు 90 లక్షల మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. 


అమెరికాలో పైలేట్స్ ట్రైనింగ్ ఇటీవల బాగా ప్రజాదరణ పొందుతోంది. శారీరక ఆరోగ్యానికి పైలేట్స్ దోహదపడుతుందని ప్రచారం జరుగుతోంది. శరీరం బలోపేతమవడం, శ్వాస తీసుకోవడం, వదలడం వంటివి మెరుగవుతాయని చెప్తున్నారు. 


ఈ అధ్యయనంలో 19 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్కులు, ఊబకాయులైన మహిళలు పాల్గొన్నారు. వీరంతా రక్త పోటు ఎక్కువగా, బరువు 30 నుంచి 40 కిలోగ్రాములు/మీటర్ స్క్వేర్డ్ ఉన్నవారు. వీరి చేత 12 వారాలపాటు మ్యాట్ పైలేట్స్ వ్యాయామం చేయించారు. వీరు తీవ్రమైన వ్యాధులు లేనివారు, ధూమపానం చేయనివారు, వీరు  సర్టిఫైడ్ మ్యాట్ పైలేట్స్ ఇన్‌స్ట్రక్టర్ పర్యవేక్షణలో క్రమబద్ధంగా వ్యాయామం చేశారు.


ఈ వ్యాయామం వల్ల గుండె రక్త నాళాలకు సంబంధించిన ఆరోగ్యానికి మేలు జరిగినట్లు నిర్థరణ అయిందని పరిశోధకులు తెలిపారు. ఊబకాయులైన యువతుల బీపీ తగ్గిందని, రక్త నాళాలు పట్టేసినట్లు ఉండటం తగ్గిందని, శరీరం ఫిట్‌నెస్ మెరుగుపడిందని తెలిపారు.


ఈ అధ్యయనాన్ని అమెరికన్ జర్నల్ ఆఫ్ హైపర్‌టెన్షన్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించాయి.


Updated Date - 2020-04-04T22:54:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising