ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొబైల్‌ ఫోన్‌ కొనివ్వలేదని.. యువకుడి కిడ్నాప్ నాటకం..

ABN, First Publish Date - 2020-09-26T16:48:46+05:30

మొబైల్‌ ఫోన్‌ కొనివ్వడానికి తండ్రి నిరాకరించడంతో కుమారుడు కిడ్నాప్‌ డ్రామా ఆడాడు. తిరువణ్ణామలై జిల్లా కల్లాయ్‌సెందూర్‌కు చెందిన రత్నవేల్‌ కుమారుడు భరత్‌(17)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై (ఐసిఎఫ్‌) : మొబైల్‌ ఫోన్‌ కొనివ్వడానికి తండ్రి నిరాకరించడంతో కుమారుడు కిడ్నాప్‌ డ్రామా ఆడాడు. తిరువణ్ణామలై జిల్లా కల్లాయ్‌సెందూర్‌కు చెందిన రత్నవేల్‌ కుమారుడు భరత్‌(17) వేటవలం ప్రభుత్వ పాఠశాలలో ప్లస్‌ టూ చదువుతున్నాడు. కొన్ని రోజులుగా మొబైల్‌ ఫోన్‌ కొనివ్వాలని తండ్రిని అడుగుతున్నాడు. ఇందుకు తండ్రి అంగీకరించక పోవడంతో ఆగ్రహించిన భరత్‌   బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. రాత్రి 9 గంటలకు  భరత్‌ను కిడ్నాప్‌ చేసినట్లు సమాచారం అందింది. వాట్సాప్‌ సమాచారంలో రూ.5 లక్షలు ఇవ్వాలని, లేకపోతే భరత్‌ను హతమారుస్తామని పేర్కొన్నారు. దిగ్ర్భాంతి చెందిన రత్నవేల్‌ వేలవలం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మొబైల్‌ సిగ్నల్‌ ఆధారంగా అక్కడున్న కొండ ఆలయం సమీపంలో తనిఖీ చేశారు. తాను చదువుతున్న పాఠశాల విద్యార్థితో కిడ్నాప్‌ నాటకం ఆడినట్లు భరత్‌ పోలీసులకు తెలిపారు. దీంతో వారిద్దరికి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి ఇంటికి పంపారు.

Updated Date - 2020-09-26T16:48:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising