ఎంపీలో నింగిని తాకిన పెట్రోల్ ధర... ఏ పట్టణంలో ఎంతంటే?
ABN, First Publish Date - 2020-12-01T14:13:54+05:30
మధ్యప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు నింగినితాకాయి. లీటరు పెట్రోలు ధర రూ. 90కి చేరుకోగా...
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు నింగినితాకాయి. లీటరు పెట్రోలు ధర రూ.90కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 81 రూపాయలుగా ఉంది. గడచిన వారం రోజుల నుంచి పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో సామాన్యునిపై భారం పడుతోంది. దేశరాజధాని ఢిల్లీలో ఈరోజు లీటరు పెట్రోలు ధర రూ. 82.34గా ఉండగా, డీజిల్ ధర రూ.72.42గా ఉంది. ప్రతీరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పులు చోటుచేసుకుంటాయి.
వాటి ధరలను ఉదయం 6 గంటలకు ప్రకటిస్తారు. పెట్రోల్, డీజిల్ రేట్లపై ఎక్సైజ్ డ్యూటీ, డీలర్ కమిషన్ మొదలైనవి వడ్డిస్తుండటంతో వీటి ధరలు రెండింతలు అవుతున్నాయి. ఇక ముంబైలో ఈరోజు పెట్రోలు లీటరు ధర రూ. 89.02గా ఉండగా, డీజిల్ ధర రూ. 78.97గా ఉంది. కోల్‌కతా పెట్రోల్ రూ. 83.87, డీజిల్ రూ .75.99గా ఉండగా, చెన్నైలో పెట్రోల్ రూ. 85.31, డీజిల్ ధర రూ. 77.44 రూపాయలుగా ఉంది. నోయిడాలో పెట్రోల్ రూ. 82.62, డీజిల్ రూ. 72.83, లక్నోలో పెట్రోల్ రూ. 82.54, డీజిల్ లీటరుకు రూ. 72.75, పట్నాలో పెట్రోల్ రూ. 84.93, డీజిల్ లీటరుకు రూ. 77.80గా ఉంది. ఇక చండీగఢ్‌లో పెట్రోల్ రూ. 79.28, డీజిల్ లీటరుకు రూ.72.17గా ఉంది.
Updated Date - 2020-12-01T14:13:54+05:30 IST