ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నిబంధనలను ప్రజలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు

ABN, First Publish Date - 2020-12-04T08:11:55+05:30

ప్రజలు కరోనా వ్యాప్తి నిరోధ నింబధనలు పాటించడం లేదని, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ల ధారణ, భౌతిక దూరం పాటింపును యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. అధికార యంత్రాంగం సైతం నిబంధనలను కఠినంగా అమలు చేయడం లేదని పేర్కొంది. రాజకీయ, సామాజిక కార్యకలాపాల్లో పెద్దఎత్తున జనం పాల్గొంటుండటాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్గదర్శకాలు ఉన్నాయి కానీ అమలులో చిత్తశుద్ధి లేదు

అమలు ఎలాగో చెప్పండి.. లోపాలను మేం సవరిస్తాం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి సుప్రీం ధర్మాసనం


న్యూఢిల్లీ, డిసెంబరు 3: ప్రజలు కరోనా వ్యాప్తి నిరోధ నింబధనలు పాటించడం లేదని, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ల ధారణ, భౌతిక దూరం పాటింపును యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. అధికార యంత్రాంగం సైతం నిబంధనలను కఠినంగా అమలు చేయడం లేదని పేర్కొంది. రాజకీయ, సామాజిక కార్యకలాపాల్లో పెద్దఎత్తున జనం పాల్గొంటుండటాన్ని ప్రశ్నించింది. కొవిడ్‌ రోగులకు సరైన చికిత్స అందేలా చూడాలని, మృతదేహాల గౌరవప్రద నిర్వహణ విషయంలో ఆస్పత్రులు సరైన విధంగా వ్యవహరించేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను గురువారం జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌.సుభా్‌షరెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం విచారించింది.


ఈ సందర్భంగా జాగ్రత్తల విస్మరణపై వ్యాఖ్యలు చేసింది. ‘ప్రజలు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. మాస్క్‌ల ధారణ, గుమిగూడటం నిరోధించడంపై మీరు (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల) సరైన మార్గదర్శకాలు ఇవ్వండి. ఏం చేయాలో చెప్పండి. లోపాలను మేం సవరిస్తాం’ అని పేర్కొంది. మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, వాటిని కచ్చితంగా అమలు చేయడంలో చిత్తశుద్ధి కొరవడిందని తమ పరిశీలనలో తేలిందని వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం, గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. మార్గదర్శకాలపై సుప్రీంకు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే, వాటిలోని లోపాలను రాష్ట్రాలు సరిదిద్దుకోవాల్సి ఉంటుందని అన్నారు. కాగా, నిర్దిష్ట సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సొలిసిటర్‌ జనరల్‌ ఈ నెల 7వ తేదీ వరకు గడువు కోరారు. దీంతో కోర్టు విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.  


‘కొవిడ్‌’ పోస్టర్లు అతికింపుపై మార్గదర్శకాలు లేవు

‘కరోనా వైరస్‌ బాధితుల నివాసాలకు పోస్టర్లు అతికించడం’ అనే అంశం.. తాము విడుదల చేసిన కొవిడ్‌-19 నియంత్రణ మార్గదర్శకాల్లో లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ మేరకు అఫిడవిట్‌లోనూ ఉందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ప్రస్తావించారు. కొవిడ్‌ రోగుల ఇళ్ల ఎదుట పోస్టర్లు అతికించకుండా చూడా లంటూ దాఖలైన పిటిషన్‌పై గురువారం జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ సుభా్‌షరెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ విధంగా చేయవద్దంటూ కేంద్ర ప్రభుత్వం ఏమైనా సూచనలు జారీ చేసిందా? అని సొలిసిటర్‌ జనరల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి ఆయన బదులిస్తూ, ఇప్పటికే కేంద్రం ఆదేశాలిచ్చిందన్నారు. దీంతో కేసును ముగిస్తున్నట్లు తెలిపిన ధర్మాసనం, తీర్పును రిజర్వ్‌ చేసింది. కాగా, మాస్క్‌లు ధరించకుండా దొరికినవారిని పరివర్తన కింద కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో స్వచ్ఛంద సేవకు పంపాలంటూ గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించింది. ఇలా చేయడం.. వారి ఆరోగ్యానికి చేటు చేస్తుందని అభిప్రాయపడింది.

Updated Date - 2020-12-04T08:11:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising