ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యసభలో పెండింగ్‌ క్లియర్‌

ABN, First Publish Date - 2020-08-14T06:59:37+05:30

‘‘ఉప రాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా ఈ నెల 11న నాలుగో ఏడాదిలోకి ప్రవేశిస్తాను. అప్పటికి ఒక్క ఫైలు కూడా పెండింగులో ఉండొద్దు. 10వ తేదీలోపు అన్నీ క్లియర్‌ చేయండి’’ రాజ్యసభ అధికారులకు వెంకయ్యనాయుడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వారంలో 4,406 ఫైళ్లకు మోక్షం కల్పించిన వెంకయ్య


న్యూఢిల్లీ, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ‘‘ఉప రాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా ఈ నెల 11న నాలుగో ఏడాదిలోకి ప్రవేశిస్తాను. అప్పటికి ఒక్క ఫైలు కూడా పెండింగులో ఉండొద్దు. 10వ తేదీలోపు అన్నీ క్లియర్‌ చేయండి’’ రాజ్యసభ అధికారులకు వెంకయ్యనాయుడు కొద్ది రోజుల క్రితం జారీ చేసిన హుకుం. దీంతో రాజ్యసభ 60 సెక్షన్లలోని సిబ్బంది ఈనెల 3 నుంచి 10వ తేదీ అర్థరాత్రి వరకూ నిరంతరాయంగా పనిచేశారు. శని, ఆదివారాలు కూడా సెలవు తీసుకోలేదు. దీంతో పెండింగులో ఉన్న 4,406 ఫైళ్లు క్లియర్‌ అయిపోయాయి. వెంకయ్య కూడా వారికి పూర్తిగా సహకరించారు. ఆగస్టు 11 నాటికి ఒక్క ఫైలూ పెండింగులో లేదని తెలియడంతో అధికారులు, సిబ్బందిని వెంకయ్య ప్రశంసించారు. రాజ్యసభ చైర్మన్‌ సచివాలయంలో 2007 నుంచీ పెండింగులో ఉన్న ఫైళ్లను కూడా క్లియర్‌ చేశారు. కాగా, తన మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పార్లమెంటు ఆవరణలో గురువారం రుద్రాక్ష మొక్కను నాటారు.


Updated Date - 2020-08-14T06:59:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising