ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్‌ తొలగింపు

ABN, First Publish Date - 2020-09-18T21:05:00+05:30

గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్‌ తొలగింపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం యాప్‌ను శుక్రవారం గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించబడింది. పేటీఎం యాప్‌ను తీసివేయడానికి గల కారణాలు ఇంకా అధికారికంగా తెలియరాలేదు. పేటీఎం యొక్క ఇతర యాప్స్ పేటీఎం బిజినెస్, పేటీఎం మాల్, పేటీఎం మనీ యాప్స్ ఇప్పటికీ ప్లే స్టోర్‌లో కనిపిస్తాయి. పేటీఎం యాప్‌ను ఎందుకు తీసివేయబడిందని తెలుసుకునేందుకు చాలా మంది వినియోగదారులు ట్విట్టర్‌లోకి వెళ్లారు.


గూగుల్ సంస్థ గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను తొలగించడంతో చాలా మంది భారతీయ వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తోంది. వాస్తవానికి గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను తొలగించటానికి ప్రధాన కారణం గూగుల్ నియమాలను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. పేటీఎం సంస్థ గూగుల్ ప్లే స్టోర్ పాలసీలకు విరుద్ధంగా ఫాంటసీ స్పోర్ట్స్ సర్వీస్‌ను తన మార్క్యూ యాప్‌లో ప్రోత్సహిస్తూ వస్తోంది. ఈ మేరకు పేటీఎం సంస్థకు గూగుల్ సంస్థ చాలాసార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఆ సంస్థ పట్టించుకోలేదు. 

Updated Date - 2020-09-18T21:05:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising