ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ప్రబలుతున్న వేళ ఆర్బీఐ గవర్నర్ వీడియో సందేశం

ABN, First Publish Date - 2020-03-30T14:45:00+05:30

దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంతదాస్ ప్రజలకు వీడియో సందేశమిచ్చారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిజిటల్ చెల్లింపులు చేయండి, సురక్షితంగా ఉండండి...

ముంబై : దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంతదాస్ ప్రజలకు వీడియో సందేశమిచ్చారు. ప్రజలందరూ కరోనా వైరస్ ప్రబలకుండా ముందుజాగ్రత్తగా డిజిటల్ చెల్లింపులు చేస్తూ సామాజిక దూరం పాటించాలని శక్తికాంతదాస్ సూచించారు. ‘‘కరోనా వైరస్ బారి నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, వివిధ మొబైల్ యాప్‌లతో డిజిటల్ చెల్లింపులు చేయండి, సురక్షితంగా ఉండండి’’ అని ఆర్బీఐ గవర్నరు విడుదల చేసిన వీడియో సందేశంలో కోరారు.


కరోనా కట్టడికి 21 రోజుల లాక్ డౌన్ సందర్భంగా ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ డిజిటల్ బ్యాంకింగ్ సాయంతో చెల్లింపులు చేయాలని సలహా ఇచ్చారు. ‘‘కరోనావైరస్ వ్యాప్తి కారణంగా మనందరం చాలా కష్టతరమైన సమయాన్ని ఎదుర్కొంటున్నాం. ఈ సమయంలో, మనం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి’’ అని గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు.

Updated Date - 2020-03-30T14:45:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising