ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్నాలో 10వతేదీ నుంచి మళ్లీ లాక్‌డౌన్

ABN, First Publish Date - 2020-07-09T13:09:12+05:30

కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీహార్ రాజధాని నగరమైన పట్నాలో ఈ నెల 10 నుంచి 16వతేదీ వరకు 7 రోజుల పాటు మళ్లీ లాక్ డౌన్ విధిస్తున్నట్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్ ఉత్తర్వులు

పట్నా (బీహార్): కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీహార్ రాజధాని నగరమైన పట్నాలో ఈ నెల 10 నుంచి 16వతేదీ వరకు 7 రోజుల పాటు మళ్లీ లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆ జిల్లా మెజిస్ట్రేట్ కుమార్ రవి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత మూడు వారాలుగా పట్నా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న దృష్ట్యా దీన్ని కట్టడి చేసేందుకు మళ్లీ వారం రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు కలెక్టరు ప్రకటించారు. లాక్ డౌన్ సందర్భంగా అన్ని మతాల ప్రార్థనామందిరాలను మూసివేయాలని కలెక్టరు ఆదేశించారు. పండ్లు, కూరగాయలు, మాంసం, చేపల దుకాణాలు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు తెరచి ఉంచుతామని కలెక్టరు చెప్పారు. ఒక్క బుధవారం రోజే బీహార్ లో 749 కరోనా కేసులు బయటపడ్డాయి. బీహార్ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,274కు పెరిగింది. కరోనా వ్యాప్తి చెందుతున్నందున బీహార్ సచివాలయంతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోకి సందర్శకులను అనుమతించమని సర్కారు ప్రకటించింది. 

Updated Date - 2020-07-09T13:09:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising