పెరుగుతున్న కరోనా కేసులు.. పది నుంచి రాజధానిలో లాక్‌డౌన్!
ABN, First Publish Date - 2020-07-09T04:19:19+05:30
దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకూ ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
పట్నా: దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకూ ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. బిహార్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని పట్నాలో ఓ వారం పాటు లాక్‌డౌన్ విధించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ‘పట్నాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన మూడు వారాల్లో ఈ పెరుగుదల మరీ ఆందోళనకరంగా ఉంది. అందుకే ఈ నెల 10 నుంచి 16 వరకు ఓ వారం పాటు లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించాం’ అని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కుమార్ రవి పేర్కొన్నారు. ఈ లాక్‌డౌన్‌లో కూరగాయలు, మాంసం, చేపల దుకాణాలు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అలాగే సాయంత్రం 4 నుంచి గంటల వరకు తెరిచి ఉంటాయని అధికారులు తెలిపారు.
Updated Date - 2020-07-09T04:19:19+05:30 IST