ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త మ్యాప్‌కు నేపాల్ పార్లమెంట్ ఆమోదం

ABN, First Publish Date - 2020-06-14T01:38:39+05:30

నేపాల్ కొత్త మ్యాప్‌కు ఆ దేశ పార్లమెంట్ నేడు ఆమోద ముద్ర వేసింది. భారత భూభాగాలను తనవిగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాట్మండు: నేపాల్ కొత్త మ్యాప్‌కు ఆ దేశ పార్లమెంట్ నేడు ఆమోద ముద్ర వేసింది. భారత భూభాగాలను తనవిగా చూపిస్తూ నేపాల్ ఈ సరికొత్త మ్యాప్‌ను తయారుచేసింది. ఈ మ్యాప్ ప్రకారం భారత్‌లోని కాలాపానీ, లిపులేఖ్, లింపియధూరా ప్రాంతాలు నేపాల్‌ భూభాగంలోనివని ఆ దేశ ప్రభుత్వం వాదన. అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఆమోదం కూడా పొందడంతో ఈ వాదనకు నేపాల్‌లో చట్టబద్ధత లభించింది. ఇదిలా ఉంటే నేపాల్ ఈ మ్యాప్‌ను మొదటిసారిగా విడుదల చేసినప్పుడు దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏకపక్షంగా తీసుకున్న ఇలాంటి నిర్ణయాలను భారత్ సమర్థించదని ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఈ మ్యాప్‌కు ఎంటువంటి చారిత్రాత్మక ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. అయితే ఇప్పుడు ఈ మ్యాప్‌పై నేపాల్ పార్లమెంట్ కూడా ఆమోదం తెలపడంతో భారత్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Updated Date - 2020-06-14T01:38:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising