ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్-19 ఎఫెక్ట్...పారాసిటమాల్ టాబ్లెట్స్ ధరలు 40 శాతం పెంపు

ABN, First Publish Date - 2020-02-18T16:07:42+05:30

చైనా దేశంతోపాటు పలు ప్రపంచ దేశాల్లో ప్రబలిన కొవిడ్-19 ప్రభావం వల్ల భారత దేశంలో పారాసిటమాల్ టాబ్లెట్స్ ధరలు 40 శాతం పెరిగాయి.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : చైనా దేశంతోపాటు పలు ప్రపంచ దేశాల్లో ప్రబలిన కొవిడ్-19 ప్రభావం వల్ల భారత దేశంలో పారాసిటమాల్ టాబ్లెట్స్ ధరలు 40 శాతం పెరిగాయి. చైనా దేశంలో పారాసిటమాల్ టాబ్లెట్స్ ను ఉత్పత్తి చేసే కంపెనీలు మూతపడటంతో ప్రపంచవ్యాప్తంగా ఈ టాబ్లెట్స్ సప్లయి చైన్ లో కొరత ఏర్పడింది. మనం సాధారణంగా జ్వరాలకు వాడే పారాసిటమాల్ టాబ్లెట్స్ ధర భారతదేశంలో 40 శాతం పెరిగింది. దీంతోపాటు బాక్టిరియల్ ఇన్ఫెక్షన్లకు వినియోగించే అజితోమైసిన్ యాంటీబయాటిక్ టాబ్లెట్ల ధరలు 70 శాతం పెరిగాయని జైడస్ కాడిలా ఛైర్మన్ పంకజ్ ఆర్ పటేల్ చెప్పారు.


ఏప్రిల్ మొదటివారంలో మందులు సప్లయి కాకపోతే ఔషధాల ధరలు మరింత పెరగవచ్చని ఫార్మా ఇండస్ట్రీ యజమానులు చెపుతున్నారు. కొవిడ్ -19 వైరస్ వల్ల చైనాలో 1800 మందికిపైగా మరణించడంతో పలు ఔషధ పరిశ్రమలు మూతపడ్డాయి. చైనా దేశంలోని నగరాల్లో ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించడం వల్ల పలు ఔషధ కంపెనీలు పనిచేయడం లేదు. చైనాలో ఇలానే ఔషధ కంపెనీలు మూసివేస్తే భారతదేశంలో మందుల ధరలు ఆకాశన్నంటే అవకాశముంది. దీంతో మన దేశంలో ఔషధాల ధరల పెంపుతో రోగులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-02-18T16:07:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising