ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పన్నీర్ సెల్వంకు భారీగా నగదు ఇచ్చారు’

ABN, First Publish Date - 2020-10-19T16:18:02+05:30

ఎడప్పాడి పళనిస్వామి అన్నాడీ ఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యేందుకు పన్నీర్‌సెల్వంకు భారీగా నగదు ముట్టజెప్పారని, దాన్ని దాచేందుకే ఓపీఎస్‌ కుమారుడు, ఎంపీ రవీంద్రనాథ్‌ మారిషస్‌కు వెళ్లాడని డీఎంకే తేని నార్త్‌ జిల్లా ఇన్‌చార్జి తంగ తమిళ్‌సెల్వన్‌ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : ఎడప్పాడి పళనిస్వామి అన్నాడీ ఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యేందుకు పన్నీర్‌సెల్వంకు భారీగా నగదు ముట్టజెప్పారని, దాన్ని దాచేందుకే ఓపీఎస్‌ కుమారుడు, ఎంపీ రవీంద్రనాథ్‌ మారిషస్‌కు వెళ్లాడని డీఎంకే తేని నార్త్‌ జిల్లా ఇన్‌చార్జి తంగ తమిళ్‌సెల్వన్‌ ఆరోపించారు. తేనిలో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న తంగ తమిళ్‌సెల్వన్‌ మాట్లాడుతూ... గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేకు ఒక శాతం ఓట్లు మాత్రమే తేడా ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో డీఎంకే హవా వీస్తుందన్నారు. పార్టీలో చేరేందుకు యువత ఆసక్తి చూపుతున్నారన్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. స్టాలిన్‌ను ముఖ్యమంత్రిని చేయడం కోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తేని జిల్లాలోని నాలుగు శాసనసభ నియోజకవర్గాలను డీఎంకే కైవసం చేసుకుంటుందని, ఇక్కడ డిప్యూటీ సీఎం ఒ.పన్నీర్‌సెల్వం పోటీ చేసినా గెలిచే అవకాశం లేదని తంగ తమిళ్‌సెల్వం ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2020-10-19T16:18:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising