ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని ప్రకటనతో మళ్లీ రోడ్లపైకి పోటెత్తిన జనం!

ABN, First Publish Date - 2020-03-25T03:41:45+05:30

కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ.. మూడు వారాలపాటు దేశం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ.. మూడు వారాలపాటు దేశం మొత్తం లాక్‌డౌన్ చేస్తున్నట్టు ప్రకటించారు. మోదీ ఆ ప్రకటన చేశారో, లేదో జనం మరోమారు పోటెత్తిపోయారు. 21 రోజులపాటు లాక్‌డౌన్ చేస్తున్నట్టు ప్రకటన రాగానే జనంలో భయాందోళనలు మొదలయ్యాయి. వార్త బయటకు వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల కోసం జనం రోడ్లపైకి వచ్చేశారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన మోదీ ప్రసంగం ముగిసే సరికి కిరాణా దుకాణాలు రద్దీగా మారిపోయాయి. ప్రభుత్వం చెబుతున్న సామాజిక దూరం సూత్రాన్ని అందరూ మర్చిపోయి సరుకుల కోసం ఎగబడడం కనిపించింది.


ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటువంటి ఓ వీడియోను పోస్టు చేసిన ట్విట్టర్ యూజర్.. ఇలాంటి వాటిని అదుపు చేయాలంటే కర్ఫ్యూ విధించడం ఒక్కటే మార్గమేమోనని అభిప్రాయపడ్డాడు. మరో యూజర్ మోదీ ప్రకటనకు ముందు, తర్వాత రోడ్లు ఎలా ఉన్నవీ ఫొటోలు పోస్టు చేశాడు. మరో ట్విటరాటీ గ్రోసరీ స్టోర్ ముందున్న రద్దీ ఫొటోలు పోస్టు చేశాడు. సాధారణ సమయాల్లో ఒకరిద్దరు కూడా కనిపించని స్టోర్ వద్ద ప్రస్తుతం జనాలు కిక్కిరిసిపోయారని అతడు కామెంట్ చేశాడు. మరొకరు ఏటీఎంల వద్ద ఉన్న రద్దీని, ఇంకొకరు ఢిల్లీ వికాస్‌పురిలోని ట్రాఫిక్ రద్దీ ఫొటోలను పోస్టు చేశాడు. అత్యవసర సరుకులు అందరికీ అందుబాటులో ఉంటాయని ప్రధాని హామీ ఇచ్చినప్పటికీ జనం ఇలా వేలం వెర్రిగా రోడ్లపైకి రావడం పిచ్చితనమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-03-25T03:41:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising