ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత భూభాగంలోకి పాక్ డ్రోన్.. సైన్యం గుర్తించడంతో పలాయనం

ABN, First Publish Date - 2020-10-31T17:23:14+05:30

పాక్ చేసిన ప్రయత్నాన్ని భద్రతా బలగాలు తుత్తునియలు చేశాయి. పాక్ కు సంబంధించిన ఓ డ్రోన్ శుక్రవారం అర్ధరాత్రి 11:35 గం.లకు భారత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పాక్ చేసిన ప్రయత్నాన్ని భద్రతా బలగాలు తుత్తునియలు చేశాయి. పాక్ కు సంబంధించిన ఓ డ్రోన్ శుక్రవారం అర్ధరాత్రి 11:35 గం.లకు భారత భూభాగంలోకి ప్రవేశించింది. గురుదాస్ పూర్ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. భద్రతా బలగాలకు ఒక్కసారిగా డ్రోన్ శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అని గమనించగా... పాకిస్తాన్ వైపు నుంచి వస్తుందని భద్రతా బలగాలు పసిగట్టాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ డ్రోన్ పైకి తుపాకీలను ఎక్కుపెట్టాయి. కాల్పులు ప్రారంభించడమే తరువాయి డ్రోన్ పలాయనం చిత్తగించి... పాకిస్తాన్ వైపు వెళ్లిపోయిందని ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ డ్రోన్ దాదాపుగా 400 మీటర్ల ఎత్తులో 1800 మీటర్లకు పైగా భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిందని, చివరికి గురుదాస్ పూర్ లోని ఠాకూర్‌పూర్ గ్రామంలో దీనిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.  

Updated Date - 2020-10-31T17:23:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising