ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు సెక్టార్లలో కాల్పులకు బరితెగించిన పాక్

ABN, First Publish Date - 2020-11-13T21:25:05+05:30

జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ పాక్ రేంజర్లు మూడు సెక్టార్లలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ పాక్ రేంజర్లు మూడు సెక్టార్లలో కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు అధికారులు వెల్లడించారు. తొలుత ఇవాళ మధ్యాహ్నం బండిపొరా జిల్లా  గ్రూయెజ్ సెక్టార్‌లోని ఇజ్మార్గ్‌లో కాల్పులకు తెగబడిన పాక్ సైనికులు... తర్వాత కొద్ది సేపటికే కుప్వారా జిల్లా కేరాన్ సెక్టార్‌లో మరో రౌండ్ కాల్పులు జరిపారు. బారాముల్లా జిల్లా యూరీ సెక్టార్ వెంబడి భారత సైనికపోస్టుల పైనా పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు దిగిందని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనల్లో ఎక్కడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదనీ.. మొత్తం మూడు సెక్టార్లలోనూ భారత బలగాలు సమర్థంగా పాకిస్తాన్ కాల్పులను తిప్పికొట్టాయని అధికారులు వెల్లడించారు.

Updated Date - 2020-11-13T21:25:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising