ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘భారత సైన్యంలో చీలికలు తెచ్చేందుకు పాక్ యత్నాలు’

ABN, First Publish Date - 2020-10-02T02:10:12+05:30

పాకిస్థాన్ కుతంత్రాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఆ దేశం నైతికంగా రాన్రానూ దిగజారుతోంది. భారత సైన్యంలో చీలికలు తెచ్చేందుకు సామాజిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పాకిస్థాన్ కుతంత్రాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఆ దేశం నైతికంగా రాన్రానూ దిగజారుతోంది. భారత సైన్యంలో చీలికలు తెచ్చేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా దుష్ప్రచారం చేస్తోంది. పాకిస్థాన్ దురుద్దేశాన్ని గమనించిన భారత సైన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 


భారత సైన్యం గురువారం విడుదల చేసిన ప్రకటనలో పాకిస్థాన్‌నెు తీవ్రంగా దుయ్యబట్టింది. భారత సైన్యానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని దుయ్యబట్టింది. మరీ ముఖ్యంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ సీనియర్ అధికారి లెఫ్టినెంట్ జనరల్ తరన్‌జిత్ సింగ్‌పై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. 


మతం ఆధారంగా భారత దేశంలో వైరుద్ధ్యాలు సృష్టించేందుకు పాకిస్థాన్ చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో, తాజాగా భారత సైన్యంలో విభజన సృష్టించేందుకు నిస్సహాయంగా ప్రయత్నిస్తోందని భారత సైన్యం దుయ్యబట్టింది. సైన్యాన్ని అప్రతిష్ఠపాలు చేసే అటువంటి ద్వేషపూరిత ప్రయత్నాలను భారత సైన్యం నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్లు పేర్కొంది. 


కొద్ది రోజులుగా పాకిస్థాన్ ప్రభుత్వ ఆద్వర్యంలో ద్వేషపూరిత సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారం ప్రచారమవుతున్నట్లు తెలిపింది. 

Updated Date - 2020-10-02T02:10:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising