ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రఫేల్‌’ భయంతో చైనా యుద్ధ విమానాల కోసం పాకిస్థాన్ యత్నాలు

ABN, First Publish Date - 2020-11-04T01:40:11+05:30

‘రఫేల్‌’ భయంతో చైనా యుద్ధ విమానాల కోసం పాకిస్థాన్ యత్నాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పాకిస్థాన్ వెన్నులో వణుకు మొదలైంది. జూలై 29న వచ్చిన 5 రఫేల్ యుద్ధ విమానాలకు అదనంగా మరొక 3 యుద్ధ విమానాలు త్వరలో రాబోతున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్ వద్ద ఉన్న యుద్ధ విమానాలకు అత్యాధునిక క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం లేదు. దీంతో పాకిస్థాన్ అత్యవసరంగా చైనాతో యుద్ధ విమానాలు, క్షిపణుల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. 


విశ్వసనీయ సమాచారం ప్రకారం, పాకిస్థాన్ ప్రతినిథి బృందం అక్టోబరులో చైనాలో పర్యటించింది. 50 యుద్ధ విమానాలు, క్షిపణుల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ జే-10 (సీఈ) యుద్ధ విమానాల్లో 30 విమానాలను, క్షిపణులను అత్యవసరంగా సరఫరా చేయాలని చైనాను కోరింది. వాస్తవానికి ఈ ఒప్పందం కోసం 2009లో పాకిస్థాన్ ప్రయత్నించింది. అయితే జేఎఫ్-17 జెట్‌ల సంయుక్త ఉత్పత్తిపై చర్చలు ప్రారంభం కావడంతో జే-10 (సీఈ) కోసం చర్చలను నిలిపేసింది. మన దేశానికి రఫేల్ యుద్ధ విమానాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఒప్పందం కోసం చర్చలను ప్రారంభించింది. 


జే-10 (సీఈ) అనేది చైనా వాయు సేనలోని జే-10సీకి ఎక్స్‌పోర్ట్ వెర్షన్. ఇది 4.5 జనరేషన్‌కు చెందినదని తెలుస్తోంది. జే10ను చైనా వాయు సేనలో 2006లో ప్రవేశపెట్టారు. 


Updated Date - 2020-11-04T01:40:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising