ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్‌లో 2,700కు చేరిన కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-04-04T20:57:40+05:30

పాకిస్థాన్‌లో కరోనా కేసుల సంఖ్య శనివారంనాటికి 2,708కి చేరింది. దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న పంజాబ్‌ ప్రావిన్స్‌లో కరోనా పాజిటివ్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో కరోనా కేసుల సంఖ్య శనివారంనాటికి 2,708కి చేరింది. దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న పంజాబ్‌ ప్రావిన్స్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,000 దాటడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. నేషనల్ హెల్త్ సర్వీసెస్ గణాంకాల ప్రకారం ఇంతవరకూ పాక్‌లో కరోనా మృతుల సంఖ్య 40కి చేరింది. 130 మంది రోగులకు స్వస్థత చేకూరింది.


పాకిస్థాన్‌లో కరోనా ఇన్‌ఫెక్షన్ హాట్‌స్పాట్‌గా చెబుతున్న పంజాబ్‌లో 1,072 కోవిడ్-19 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత 839 కేసులలో రెండో స్థానంలో సింధ్ ఉంది. ఖైబర్ ఫక్తుంఖ్వాలో 343, గిల్గిత్ బాల్టిస్థాన‌లో 193, ఇస్లామాబాద్‌లో 75, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో 11 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వైరస్ వేగంగా విస్తరిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. కరోనా వైరస్‌‌పై పోరాటానికి గాను పాకిస్థాన్‌కు 200 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు శుక్రవారంనాడు ఆమోదం తెలిపింది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా నిర్మాణరంగానికి పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ భారీ ప్యాకేజ్ ను ప్రకటించారు.

Updated Date - 2020-04-04T20:57:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising