ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాకిస్థాన్ పదే పదే అబద్ధాలు చెప్తోంది : భారత్

ABN, First Publish Date - 2020-08-13T23:28:25+05:30

జమ్మూ-కశ్మీరుపై పాకిస్థాన్ పదే పదే అబద్ధాలు చెప్తోందని భారత్ మండిపడింది. తాజాగా పాకిస్థాన్ దౌత్యవేత్త

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : జమ్మూ-కశ్మీరుపై పాకిస్థాన్ పదే పదే అబద్ధాలు చెప్తోందని భారత్ మండిపడింది. తాజాగా పాకిస్థాన్ దౌత్యవేత్త ఒకరు చేసిన వ్యాఖ్యలపై బీజింగ్‌లోని ఇండియన్ ఎంబసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 


చైనాలోని ‘గ్లోబల్ టైమ్స్‌ పత్రికకు ఆ దేశానికి పాకిస్థాన్ రాయబారి మొయినుల్ హక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో జమ్మూ-కశ్మీరు గురించి మాట్లాడారు. కశ్మీరీల బాధలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలను తీసుకునేందుకు  ముందుకు రావాలని ప్రపంచ దేశాలను కోరారు. 


హక్ వ్యాఖ్యలపై బీజింగ్‌లోని ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటనలో ఘాటుగా స్పందించింది. జమ్మూ-కశ్మీరు భారత దేశంలో అంతర్భాగమని, అయినప్పటికీ, పాకిస్థాన్ రాయబారి తమ అబద్ధాలను పునరుద్ఘాటించారని దుయ్యబట్టింది. జమ్మూ-కశ్మీరు విషయంలో మాట్లాడేందుకు ఇతర దేశాలకు అధికార పరిథి లేదని స్పష్టం చేసింది. జమ్మూ-కశ్మీరు వ్యవహారాలు పూర్తిగా భారత దేశ అంతర్గత అంశాలని తెలిపింది. హక్ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, దీనిలో ఆశ్చర్యం ఏమీ లేదని తెలిపింది. అధికరణ 370 రద్దు తర్వాత గడచిన ఏడాదిలో జమ్మూ-కశ్మీరు చెప్పుకోదగ్గ ప్రగతి సాధించిన విషయాన్ని దాచిపెట్టడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. 


జమ్మూ-కశ్మీరును నాశనం చేయడానికి క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని పాకిస్థాన్ ప్రోత్సహిస్తోందని, అందుకు భిన్నంగా భారత దేశం జమ్మూ-కశ్మీరు అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడుతోందని పేర్కొంది. శాంతి, సుస్థిరత, అభివృద్ధి సాధించేందుకు సమన్వయంతో కూడిన కృషి చేస్తోందని పేర్కొంది. 


Updated Date - 2020-08-13T23:28:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising