ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా సహాయంతో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి? క్లారిటీ ఇచ్చిన పాక్ ప్రభుత్వం!

ABN, First Publish Date - 2020-04-26T17:45:08+05:30

చైనా సహాయంతో పాకిస్థాన్ కరోనా వ్యాక్సిన్ రూపకల్పన చేస్తోందనే వార్తలపై ఇమ్రాన్ ప్రభుత్వం శనివారం క్లారిటీ ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: చైనా సహాయంతో పాకిస్థాన్ కరోనా వ్యాక్సిన్ రూపకల్పన చేస్తోందనే వార్తలపై ఇమ్రాన్ ప్రభుత్వం శనివారం క్లారిటీ ఇచ్చింది. వ్యాక్సిన్ రూపకల్పన కోసం పాక్‌ ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆరోగ్య శాఖ సలహాదారు జాఫర్ మీడియా పత్రికా సమావేశంలో స్పష్టం చేశారు. వ్యాక్సిన్ అభివృద్ధిపై పాక్ ప్రభుత్వం దృష్టి పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు.


అయితే కరోనా వ్యాక్సిన్ రూపకల్పనకు సంబంధించిన తమను ఓ చైనా కంపెనీ సంప్రదించిందని, క్లినికల్ ట్రైయల్స్‌లో భాగం కావాలని కోరిందని తెలిపారు. జపాన్ నుంచి కూడా ఇదే తరహా ప్రతిపాదన వచ్చిందన్నారు. ఈ విషయంలో ఆయా కంపెనీల నుంచి మరింత సమాచారం కోరామని తెలిపారు.


పాక్‌లో కరోనా మహమ్మారి పరిస్థితిపై కూడా ఆయన స్పందించారు. దేశంలోని 79 శాతం కరోనా కేసుల్లో రోగులకు వైరస్ స్థానికంగా సోకిందని వెల్లడించారు. ప్రస్తుతం పాక్ లోకల్ ట్రాన్సిమిషన్ స్టేజీలోనే ఉండటంతో వ్యాధి కట్టడికి ప్రభుత్వం టెలీమెడిసిన్ ప్రారంభించిందని తెలిపారు. ఇందులో భాగంగా స్థానిక డాక్టర్లతో పాటూ, విదేశీ వైద్యులు కూడా రోగ లక్షణాలకు సంబంధించి బాధితులకు ఫోన్ ద్వారా తగు సూచనలు సలహాలు ఇస్తారన్నారు. మరోవైపు పాక్‌లో కరోనా కేసుల సంఖ్య 12,227కు చేరుకుంది. దీంతో రంజాన్ మాసం సందర్భంగా వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు అన్నీ ప్రజలు జాగ్రత్తలూ తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

Updated Date - 2020-04-26T17:45:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising