ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అది నిరాధారమైన వాదన: పాకిస్తాన్‌కు భారత్ కౌంటర్

ABN, First Publish Date - 2020-05-10T01:04:52+05:30

భారత్ ‌నుంచి తమకు చెందాల్సిన నీరు అందడం లేదన్న పాకిస్తాన్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. అందుకు ఎటువంటి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్ ‌నుంచి తమకు చెందాల్సిన నీరు అందడం లేదన్న పాకిస్తాన్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. అందుకు ఎటువంటి ఆధారం లేదని, నిబంధనల ప్రకారం పాకిస్తాన్‌కు చెందాల్సిన నీటినంతటినీ విడుదల చేస్తూనే ఉన్నామని పేర్కొంది. సింధు జలాల హైకమిషనర్ ప్రదీప్ కుమార్‌కు పాకిస్తాన్ హైకమిషనర్ సయ్యద్ మహమ్మద్ మెహెర్ అలీ షా బుధవారం ఓ లేఖ పంపించారు. దాని ప్రకారం, సట్లెజ్ నది నుంచి పాక్‌కు అందాల్సిన 31,853 క్యూసెక్కుల నీరు అందడం లేదని, 18,700 క్యూసెక్కులు మాత్రమే అందుతున్నాయని ఆరోపించారు.


ఆ లేఖపై స్పందించిన ప్రదీప్ కుమార్, పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. ‘తావి, చీనాబ్ నదుల నుంచి పాక్‌కు అందాల్సిన నీటిలో ఎలాంటి తగ్గింపులు చేయడం లేదని, వేసవి కాలంలో ఎంత నీటిని విడుదల చేయాలో అంత నీరు విడుదల చేస్తూనే ఉన్నామని శుక్రవారం తెలిపారు. దీనిపై విచారణ చేసి నిజాలను తెలుసుకోవాలని పాకిస్తాన్‌కు సూచించారు.

Updated Date - 2020-05-10T01:04:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising